ఐపీఎల్ 2023 : అంతా అయిపోయాక… రెచ్చిపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ !

-

ఐపీఎల్ లో భాగంగా పంజాబ్ మరియయు ఢిల్లీ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ చెలరేగి ఆడుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ తప్పుడు నిర్ణయం తీసుకుందా అన్న అనుమానం కలిగేలా ఢిల్లీ బ్యాటింగ్ లో అదరగొడుతోంది. ఈ సీజన్ లో ఏ మ్యాచ్ లోనూ ఇంత ఫాస్ట్ గా స్కోర్ చేసింది లేదు. కానీ ఐపీఎల్ నుండి నిష్క్రమించడంతో ఇప్పుడు తమ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ వార్నర్ కూడా మెరుగైన స్ట్రైక్ రేట్ తో పరుగులు చేయడం విశేషం. ఈ మ్యాచ్ లో ఎటువంటి ఒత్తిడి లేకపోవడంతో పూర్తి స్వేచ్ఛగా ఆడుతున్న ఢిల్లీ మంచి రిజల్ట్ ను రాబట్టింది. వార్నర్ అర్ద సెంచరీ కి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోగా, మరో ఓపెనర్ పృథ్వీ షా మాత్రమే ఇప్పటికే అర్ద సెంచరీ సాధించి ఢిల్లీ కి భారీ స్కోర్ ను అందించడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఓవర్ కు పదికి పైగా పరుగులు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ రాణించడం ఏదో సీజన్ ముందు నుండి చేసి ఉంటే ఈ రోజు ప్లే ఆఫ్ కు ఢిల్లీ కూడా వెళ్లి ఉండేది. అందుకే దొంగలు పడిన నాలుగు రోజులకు కుక్కలు మొరిగినట్లు ఢిల్లీ బ్యాటింగ్ ఉందని కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news