సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న తెలుగు క్రికెటర్లలో ఈ సీజన్ లో కొందరు బెంచ్ కే పరిమితం అయ్యారు. కాగా ఈ రోజు బెంగుళూరు తో జరగనున్న నామమాత్రం మ్యాచ్ లో ఒక తెలుగు కుర్రాడికి తుది జట్టులో చోటు కల్పించి హైదరాబాద్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించారు. దేశవాళీ ప్లేయర్ నితీష్ రెడ్డి ఈ రోజు మ్యాచ్ లో ఆడుతున్నాడు. సీజన్ మొత్తానికి బెంచ్ కే పరిమితం అయినా ఆఖరి మ్యాచ్ లో మాత్రం అదృష్టం బాగుంది చోటు దక్కింది. రైట్ హ్యాండెడ్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న నితీష్ రెడ్డి ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 10 మ్యాచ్ లు ఆడి 200 పరుగులు మరియు వికెట్లు సాధించాడు.
లిస్ట్ ఏ లో 14 మ్యాచ్ లలో 293 పరుగులు మరియు 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 5 టీ 20 లు ఆడడం ద్వారా 92 పరుగులు చేశాడు. మరి ఈ రోజు మ్యాచ్ లో తనకు అవకాశం దక్కి మ్యాచ్ ను గెలిపించే ప్రదర్శన చేస్తాడా చూద్దాం.