ఐపీఎల్ మరో ఆసక్తి పోరు నెలకొంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలకపోరు జరగనుంది. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పుణే వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. వరస విజయాలతో రాజస్థాన్ రాయల్స్ ఫుల్ జోష్ లో ఉంది. రాజస్థాన ఓపెనర్ జోస్ బట్లర్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. బట్లర్ తో పాటు సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్, హెట్మెయర్ లతో బ్యాటింగ్ విభాగం స్ట్రాంగ్ గా ఉంది. దీంతో పాటు అశ్విన్, ట్రెంట్ బౌల్ట్ తో బౌలింగ్ విభాగం కూడా గట్టిగా ఉంది. మరోవైపు ఆర్సీబీ తన జట్టుకు తగ్గట్టుగా రాణించడం లేదు. పేపర్ పై స్ట్రాంగ్ గా ఉన్నా… విరాట్ కోహ్లీ రాణించలేకపోతున్నాడు. మరోవైపు డుప్లెసిస్, మాక్స్ వెల్, దినేష్ కార్తిక్ తో బలంగానే ఉంది. పాయింట్ టెబుల్ లో మూడో స్థానంలో రాజస్థాన్ ఉంది. 7 మ్యాచుల్లో ఐదింటిలో రాజస్థాన్ గెలిచింది. మరోవైపు ఆర్సీబీ 8 మ్యాచుల్లో ఐదింటిలో గెలిచింది.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్(w/c), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, డారిల్ మిచెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(సి), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పటీదార్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(w), హర్షల్ పటేల్, వనిందు హసరంగా, జోష్ హాజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్