స్ఫూర్తి: పుట్టగొడుగులతో తల్లీ కొడుకు రోజుకి నలభై వేలు సంపాదిస్తున్నారు..!

-

కష్టపడకుండా కూర్చుంటే ఏదీ మన దగ్గరికి రాదు. ఏదైనా సాధించాలన్న మంచిగా ముందుకు వెళ్లాలన్న తప్పక కష్టపడాలి. నిజానికి ఈ తల్లి కొడుకు కూడా ఎంతో కష్టపడి పుట్టగొడుగుల సాగు చేస్తూ రోజుకి 40000 సంపాదిస్తున్నారు. ఇక మరి వీళ్ళ వ్యాపారం గురించి, వీళ్ళ యొక్క కష్టం గురించి ఇప్పుడు చూద్దాం. నిజంగా ఇలాంటి వాళ్ళ కష్టాన్ని ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా సక్సెస్ అవడానికి అవుతుంది.

 

కేరళ కి చెందిన ఈ తల్లి కొడుకులు పుట్టగొడుగుల పెంపకం మొదలుపెట్టారు. స్థానిక మార్కెట్లో పుట్టగొడుగులకు డిమాండ్ ఎక్కువగా ఉందని గ్రహించి పుట్టగొడుగుల సాగు చేయడం మొదలుపెట్టారు. వ్యవసాయంపై జిత్తు కి ఆసక్తి ఉండడంతో చదువు అయిపోయిన తర్వాత తల్లితో పాటు ఐదు వేల చదరపు అడుగుల వ్యవసాయ స్థలం తీసుకుని దీనిని కొనసాగిస్తున్నారు.

ప్రతి రోజు 80 నుండి 100 కిలోల పుట్టగొడుగులు ఉత్పత్తి అవుతాయి. ఇలా ఈ తల్లి కొడుకు 35 వేల రూపాయల నుంచి 40 వేల వరకు రోజుకు సంపాదిస్తున్నారు. తక్కువ సమయంలోనే విజయాన్ని అందుకున్నారు ఈ తల్లి కొడుకులు.

అలానే కొంతమందిని తీసుకుని ఉపాధి కూడా కల్పించారు. ప్రభుత్వ సంస్థల కోసం ఈ రంగంలో కొత్తవారికి స్వల్పకాలిక శిక్షణను కూడా అందిస్తారు. ఇప్పటివరకు జిత్తు నిర్వహించిన తరగతులకు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు. విత్తనాలు ఎంచుకోవడం మొదలు పలు చిట్కాలను రైతులకి చెప్పేవాడు ఇలా పుట్టగొడుగుల పెంపకం చేయడం మాత్రమే కాకుండా తరగతులు నిర్వహించి ఎంతో మందికి సాయం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news