నేడే ఐపీఎల్ ఫైనల్..తుదిపోరుకు సిద్ధమైన ఢిల్లీ, ముంబై..!

గత నెల రోజులగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న వచ్చిన ఐపీఎల్ తుడి గట్టానికి చేరుకుంది..ఎన్నో అంచనాలు..మరెన్నో అవాంతరాలు దాటుకొని స్టార్ట్‌ అయిన ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరింది..బంతికి బంతికి మారిన ఆధిపత్యాలు, సూపర్‌ ఓవర్ల పోరాటం ఇలా ఎన్నో మలుపులతో జరిగిన ఈ ఐపీఎల్ సీజన్‌ ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చింది.. లీగ్‌ స్టేజిలో టేబుల్‌ టాపర్లుగా ఉన్న ముంబై, ఢిల్లీ జట్టే ఫైనల్‌లో తలపడనున్నాయ్‌.. నాలుగు సార్లు కప్‌ కొట్టిన ముంబైను ఓడించడం ఢిల్లీకి సవాల్‌తో కూడున్నపనే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముంబై టీమ్ తన స్టామినా చూపిస్తోందా..? లేదా ఢిల్లీ తన ఫస్ట్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంటోందా..? అనే ఉత్కంఠ ఏర్పడింది. ఇవాళ జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం ఇరుజట్లూ గట్టిగానే సిద్ధమయ్యాయి.