IPL 2023 మినీ వేలానికి రంగం సిద్దం.. ఎప్పుడంటే..?

-

IPL 2023 : ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ కు అదిరిపోయే శుభవార్త అందింది. ఐపీఎల్-2023 మినీ వేలానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం అందుతోంది. గత సీజన్ వేలం జరిగిన బెంగుళూరులోనే ఈసారి కూడా వేలాన్ని నిర్వహించాలని బిసిసిఐ భావిస్తున్నట్లు సమాచారం.

ఐపిఎల్-2023 సీజన్ ను మార్చి చివరి వారంలో ప్రారంభించాలని భావిస్తున్న బిసిసిఐ డిసెంబర్ 16న మినీ వేలాన్ని నిర్వహించాలని యోచిస్తున్నట్లు బిసిసిఐ కి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ఇటీవల జరిగిన అన్యువల్ జనరల్ మీటింగ్ లో మినీ వేలం తేదీని ఖరారు చేయడంతోపాటు ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ ని కూడా సవరించాలని తెలుస్తోంది. పర్స్ వ్యాల్యూని రూ.90 నుంచి 95 కోట్లకు పెంచనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అక్టోబర్ 18 న జరిగే వార్షిక సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news