నేడే ఐపీఎల్ షెడ్యూల్ విడుదల..!

-

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూలు నేడు విడుదల కానుంది. షెడ్యూలు విడుదల ఆలస్యమైన మాట నిజమేనని, నేడు విడుదల చేస్తామని బీసీసీఐ చీఫ్ గంగూలీ పేర్కొన్నాడు. అయితే పూర్తిస్థాయి షెడ్యూలు విడుదల చేస్తారా? లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. ఇక ఐపీఎల్ సభ్యులు ఒక్కొక్కరు కరోనా బారినపడటం ఆందోళన రేపుతుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని 13 మందికి కరోనా సోకగా..

తాజాగా బీసీసీఐ బృందంలోని ఓ వ్యక్తికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇకపోతే యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికల్లో మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. గత సీజన్లతో పోలిస్తే అరగంట ముందే ఈసారి మ్యాచ్‌లను స్టార్ చేసే అవకాశం ఉందట.

Read more RELATED
Recommended to you

Latest news