ఐపిఎల్ ఈ రోజు రాజస్థాన్ మరియు పంజాబ్ జట్ల మధ్యన గౌహతి వేదికగా మ్యాచ్ జరుగుతోంది. రెండు జట్లు కూడా తాము ఆడిన మొదటి మ్యాచ్ లో గెలిచి ఉత్సాహంతో బరిలోకి దిగారు. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ చేజింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లు స్ట్రాంగ్ ప్లేయర్స్ తో ఉన్నాయి. మరి ఈ రెండు జట్లలో ఎవరు గెలుస్తారు అన్నది ప్రేక్షకులలో ఆసక్తికరంగా మారింది. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఎలా తన జట్టును సక్సెస్ వైపు నడిపిస్తాడు అన్నది తెలియాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే.
రాజస్థాన్ కనుక గెలవాలంటే మరోసారి బట్లర్, శాంసన్, జైస్వాల్ లు రాణించక తప్పదు. అదే సమయంలో పంజాబ్ బౌలింగ్ లైన్ అప్ ను తక్కువ అంచనా వేయకూడదు. అర్ష్ దీప్ సింగ్, ఎల్లిస్, సామ్ కర్రన్ లతో ఫాస్ట్ బౌలింగ్ పటిష్టంగా ఉంది. ఇక రాహుల్ చహర్, సికందర్ రాజా మరియు హర్ప్రీత్ లు స్పిన్ తో ఆకట్టుకుంటున్నారు. ఈ పిచ్ మీద ఎన్ని పరుగులు చేసినా చేజింగ్ చేయడానికి అంత కష్టం ఉండకపోవచ్చు. ఇప్పుడు పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా 200 పరుగులు ఈజీగా చేసేలా ఉంది. మరి చూద్దాం గబ్బర్ ధావన్ మరియు సంజు శాంసన్ ల పోరులో ఎవరు విజయకేతనాన్ని ఎగురవేస్తారో ?