టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.మొదటి నుండి ఈ జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా బలమైంది.దీంతో లోకేష్ పాదయాత్రకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపధ్యం లో లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై స్థానిక ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని లేవనెత్తుతూ తనదైన శైలిలో ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గం యాత్ర కొనసాగుతోంది.
ఈ నేపధ్యం లో ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో లోకేష్ కి ఒక్క క్షణం లో ప్రమాదం తప్పింది. విషయంలోకి వెళ్తే పాదయాత్ర సందర్భంగా కూడేరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు లోకేష్ ను భారీ గజమాలతో సత్కరించే ఏర్పాట్లు చేయడం జరిగింది.ఈ క్రమంలో భారీ క్రేన్ సహాయంతో లోకేష్ పై గజమాల వేసే ప్రయత్నంలో క్రేన్ వైర్ లు ఒక్కసారిగా తెగి కింద పడ్డాయి. ఎంతో బరువు ఉండే ఆ గజమాల లోకేష్ పై పడింది. దీంతో వెంటనే అప్రమత్తమయ్యి తప్పించుకున్నారు లోకేష్ . చుట్టుపక్కల ఉన్న భద్రత సిబ్బంది కూడా వెంటనే అలర్ట్ కావటంతో లోకేష్ కి పెద్ద ప్రమాదం తప్పింది.అయితే ఇంత పెద్ద సంఘటన జరిగినా ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరు అక్కడ ఉపిరి పీల్చుకున్నారు.