షిరిడీ వెళ్లాలనుకుంటున్నారా..? అయితే హైదరాబాద్ టు షిరిడి టూర్ ప్యాకేజీ గురించి ఇప్పుడే తెలుసుకోండి..!

-

షిరిడి వెళ్లాలని చాలా మంది మొక్కుకుంటారు. కానీ వెళ్లడం కుదరకపోవచ్చు. అయితే షిరిడీ వెళ్లాలనుకునే సాయి భక్తులకు ఇది చక్కటి శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి షిరిడీ వెళ్లేందుకు ప్యాకేజీని తీసుకు వచ్చింది. దీనితో చక్కగా బాబా దర్శనం చేసేసుకోవచ్చు. ఇక ఈ ప్యాకేజీ కోసం పూర్తి వివరాలను చూస్తే.. ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ.

ప్రతీ శుక్రవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉండనుంది. రైలులో మీరు షిరిడి, నాసిక్ చూసి వచ్చేయచ్చు. ఇక ప్యాకేజీ కి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 6.50 గంటలకు మీరు అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కితే నెక్ట్స్ డే ఉదయం 7.10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్ కి వెళ్తారు. నెక్స్ట్ మీరు బాబా దర్శనం చేసుకున్నాక నైట్ షిరిడి లోనే స్టే చెయ్యాల్సి వుంది. మూడవ రోజు నాసిక్ బయల్దేరాలి.

త్రయంబకేశ్వర్, పంచవటి కూడా చూడచ్చు. రాత్రి 9.20 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఎక్కితే నాలుగో రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ రీచ్ అవుతారు. టూర్ పూర్తి అవుతుంది. ఇక ఈ ప్యాకేజీ ధరల విషయానికి వస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4,200 గా వుంది. అదే డబుల్ ఆక్యుపెన్సీకి అయితే రూ.4,940 పే చెయ్యాల్సి వుంది. కంఫర్ట్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5,890, అదే డబుల్ ఆక్యుపెన్సీకి చూస్తే రూ.6,630 చెల్లించాలి. పూర్తి వివరాలను మీరు IRCTC అధికారిక వెబ్ సైట్ లో చూసి బుక్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news