ఆ రైతులకి గుడ్ న్యూస్… అకౌంట్ లోకి డబ్బులు..!

-

రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. వాటిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా చాలా మంది రైతులు ప్రయోజనాన్ని పొందుతున్నారు. 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌ డబ్బులను కేంద్రం రిలీజ్ చేసింది. దీనితో 8 కోట్లకు పైగా రైతుల అకౌంట్లలో రూ.16,000 కోట్లు విడుదల చేయడం జరిగింది.

farmers

అక్టోబర్ 24 లోగా రైతుల అకౌంట్లలో డబ్బులు పడతాయన్నారు. కానీ సాంకేతిక కారణాల వల్ల డబ్బులు లేట్ గా అందుతాయన్నారు. ఇక ఇదిలా ఉంటే రైతుల అకౌంట్లలో నాలుగు నెలలకు ఒక సారి డబ్బులు పడతాయి. మొత్తం ఈ డబ్బులు మూడు విడతల్లో రూ.6,000 జమ అవుతాయి.

కానీ కొందరికి మాత్రం రూ.4,000 జమ అయ్యాయి. 11వ ఇన్‌స్టాల్‌మెంట్‌ రూ.2,000, 12వ ఇన్‌స్టాల్‌మెంట్ రూ.2,000 మొత్తం రూ.4,000 జమ చేస్తోంది. కనుక ఆ రెండు, ఈ రెండు మొత్తం నాలుగు వేలు ఖాతాలో వేస్తోంది. అయితే మే లో డబ్బులు వచ్చినవారికి మాత్రం రెండు వేలే వస్తున్నాయి. ఇదిలా ఉంటే రైతులు తప్పకుండా ఈకెవైసి చేయించుకోవాలి. గతంలో కూడా ఈ విషయం గురించి ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రాసెస్ ని రైతులు పూర్తి చేసుకుంటే మంచిది.

 

Read more RELATED
Recommended to you

Latest news