వైసీపీపై ఆనం అసంతృప్తి..జంపింగ్ కోసమేనా?

-

వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి మొదట నుంచి స్వపక్షంలో విపక్ష నాయకుడుగానే ఉంటున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తమ పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎప్పుడైతే సొంత పార్టీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారో..అప్పటినుంచే ఆనం కూడా విమర్శలు చేశారు. కానీ రఘురామ దాడి చేసినట్లు చేయలేదు..అందుకే ఆనం పార్టీకి దూరం కాలేదు.

అయితే మధ్యలో కొన్ని రోజులు ఆనం సైలెంట్ అయ్యారు..ఆ తర్వాత అధికారులు తన నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని విమర్శలు చేశారు. ఒకానొక సమయంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్‌పై కూడా విమర్శలు చేశారు. ఇలా అడపాదడపా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా కూడా..ఆనం తమ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రోడ్లపై గుంతలు పూడ్చలేదని, కొత్త ప్రాజెక్టులు కట్టలేదని, అభివృద్ధి లేదని..పెన్షన్లతో ఓట్లు అడగాలి అంటే గత ప్రభుత్వం కూడా పెన్షన్లు ఇచ్చిందని..కాకపోతే సంక్షేమంలో మనం ఓ రూపాయి ఎక్కువ ఇస్తున్నామని, అంతా మాత్రాన జనాలని ఓట్లు అడగలేమని, అలాగే లే అవుట్లు వేశాం గాని..ఇళ్ళు కట్టలేదని మండిపడ్డారు.

ఇలా సొంత ప్రభుత్వంపైనే ఆనం ఫైర్ అయ్యారు. దీంతో ఆనం..వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. పైగా తన స్థానంలో మరో వైసీపీ నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఆనం వైసీపీని వీడతారనే ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ అడుగుతున్నారు..అది దక్కకపోతే టీడీపీలోకి వస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆనం కుమార్తె కైవల్య టీడీపీలో చేరారు. ఆమెకు ఆత్మకూరు సీటు ఇస్తారని తెలుస్తోంది. మరి చూడాలి ఆనం సైతం వైసీపీకి షాక్ ఇచ్చి. టీడీపీలో చేరతారేమో.

Read more RELATED
Recommended to you

Latest news