మండలి రద్దు బీజేపీ చేతుల్లోనే ఉందా?

-

భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిన తన నిర్ణయాలకు అడ్డంకిగా ఉందని ఏపీ శాసనమండలిని సీఎం జగన్ రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి, కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే. కీలకమైన మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందగా, మండలిలో బ్రేక్ పడింది. ఎందుకంటే మండలిలో టీడీపీకి బలం ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలకు ఉపయోగం లేని మండలి ఉండటం అనవసరమని, దీని వల్ల ప్రజాధనం వృధా అని చెప్పి, జగన్ మండలి రద్దు బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి, దానికి ఆమోదముద్ర వేసి, గవర్నర్‌కు పంపారు. గవర్నర్ సైతం ఆమోదం తెలిపి, కేంద్రానికి పంపారు.

అయితే ఈ మండలి రద్దు ప్రక్రియ ఇప్పుడు ఏ దశలో ఉందో ఎవరికి తెలియదు. కానీ రద్దు మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేతుల్లోనే ఉంది. మండలి రద్దు బిల్లుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం తెలిపి, ఆ బిల్లుని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, నెగ్గించుకోవాల్సి ఉంటుంది. చివరికి రాష్ట్రపతి సంతకం చేసి ఆమోదముద్ర వేస్తే మండలి రద్దు అవుతుంది. కానీ ఈ ప్రక్రియ ఇప్పటిలో జరిగేలా కనిపించడం లేదు.

పైగా జగన్ ప్రభుత్వం మండలి రద్దు గురించి కేంద్రాన్ని డిమాండ్ చేయమని చెప్పేశారు. కానీ మండలిలో ఖాళీలని మాత్రం తమ సభ్యులతో పూరిస్తామని చెబుతున్నారు. పైగా మండలిలో వైసీపీకి మెజారిటీ వచ్చేసింది. దీంతో మండలి రద్దుని వైసీపీ పట్టించుకునే అవకాశం లేదు.

అలా అని కేంద్రం రద్దు చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు. అయితే మండలి రద్దు వ్యవహారం మాత్రం బీజేపీలో చేతుల్లోనే ఉంది. బీజేపీ రద్దు వైపుకు చూడటం కష్టమే. ఈ విషయంలో అన్నీ పార్టీలు ఏకతాటిలోకి రావడం కష్టం. పైగా కొన్ని బీజేపీ పాలిత ప్రాంతాల్లో మండలి ఉంది. అలాగే కొన్ని రాష్ట్రాలు మండలి పునర్దుద్ధరణ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో మండలి రద్దు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version