తెలంగాణ వాసులకు అలర్ట్‌.. నేడు, రేపు అతి భారీ వర్షాలు

-

నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మొన్న ఝార్ఖండ్‌పై ఏర్పడిన అల్పపీడనం నిన్న మధ్యప్రదేశ్‌పైకి విస్తరించినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో కూడి ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే, బంగాళాఖాతంపై 4.5 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Extreme heavy rainfall alert issued by IMD for these states during next 4 days. Full forecast here | Mint

దీంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయన్న వాతావరణ శాఖ.. వీటి ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో అత్యధికంగా 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది

 

Read more RELATED
Recommended to you

Latest news