వయస్సు లో వున్నప్పుడు కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం ఇలా బిజిగా ఉంటారు..పిల్లలను ఎలా పెంచాలి,కుటుంబ పోషణ ఎలా చూసుకోవాలి ఇలాంటి విషయాల తో విసిగిపోయి ఉంటారు.ఆ తర్వాత వయస్సు పెరిగే కొద్ది భాద్యతలు కూడా తగ్గుతాయి.. కొంత వయస్సు పెరిగే ఏవో సాహసాలు చెయ్యాలని అనుకుంటారు. కొందరేమో అనుకున్నది సాధిస్తారు.మరి కొంతమంది ఈ వయస్సులో అవసరమా అని సైలెంట్ అయిపోతారు.50 ఏళ్ళు దాటితే అన్నిటికీ రామ్ రామ్ చెప్పి రామా కృష్ణ అంటూ వృద్దులు గడుపుతారు.వారి పిల్లలు పెద్దలు అవుతారు.ఇక అన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటారు.కానీ,కొందరు మాత్రం ఇలాంటి వారందరికీ పూర్తి భిన్నంగా ఉంటారు..
తమలోని టాలెంట్‌ని వయసుతో సంబంధం లేకుండా నిరూపిస్తూనే ఉంటారు..అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటాడు ఇక్కడ చెప్పబోయే ఓ వృద్ధుడు.60ఏళ్ల వయసులో అతడు చేసిన గొప్ప సాహసం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. కాదు, షాక్..అయ్యేలా చేస్తుంది. ఇంతకీ అతడు ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..
స్పైడర్‌మ్యాన్’గా పేరొందిన అలైన్ రాబర్ట్ శనివారం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని 48 అంతస్తుల భవనంపైకి ఎక్కాడు. ఈ సమయంలో పడిపోతే ప్రాణాలు కాపాడుకునేందుకు కూడా కనీసం ఒక తాడు సాయం కూడా తీసుకోలేదు. ఎత్తయిన భవనాలను ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకుండా ఎక్కేయడం అతని స్పెషాల్టీ. పారిస్‌లో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. అలైన్ రాబర్ట్ 60వ పుట్టిన రోజు సందర్భంగా ఇలాంటి సాహసం చేసి వైరల్ అయ్యాడు.చాలాసార్లు ఇలాంటి ఘనత సాధించాడు. ఈసారి అతను 48వ అంతస్తుకు చేరుకోవడానికి కేవలం 60 నిమిషాలు, అంటే 1 గంట సమయం పట్టిందని చెప్పాడు..మొత్తానికి ఓల్డ్ స్పైడర్ మ్యాన్ గా మరోసారి అందరూ గుర్తు చేసుకున్నారు..