తైవాన్ ఆగ్నేయ తీరాన భారీ భూకంపం

-

తైవాన్​ను​ భారీ భూకంపం అతలాకుతలం చేసింది. ఆదివారం సంభవించిన ఈ భూకంపం వల్ల పలు చోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. తైవాన్ ఆగ్నేయ తీరాన్ని నేడు భారీ భూకంపం కుదిపేసింది. తొలుత ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 7.2 గా పేర్కొన్నప్పటికీ, ఆపై దాన్ని 6.9కి తగ్గించారు. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్)వెల్లడించింది. తైటుంగ్ పట్టణానికి ఉత్తరంగా 50 కిలమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జీఎస్ తెలిపింది. కాగా, ఈ భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జపాన్ అధీనంలోని దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Strong earthquake hits southeastern Taiwan, building collapses | World  News,The Indian Express

భారీ స్థాయిలో ప్రకంపనలు రావడంతో ఇళ్ల నుంచి, షాపింగ్ మాల్స్ నుంచి పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఈ భూకంపం తాలూకు ప్రకంపనలు రాజధాని తైపేలోనూ వచ్చినట్టు ఓ మీడియా ప్రతినిధి వెల్లడించారు. ఇదే ప్రాంతంలో నిన్న 6.6 తీవ్రతతో భూకంపం సంభవించగా, నేడు అంతకుమించిన తీవ్రతతో భూమి కంపించడం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. భారీ ప్రకంపనలకు పట్టాలపై ఉన్న రైళ్లు కూడా ఊగిపోయాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news