సైకిల్‌తో కారుకే డ్యామేజ్..తుమ్మల-మండవలపై గురి..?

-

తెలుగుదేశం పార్టీకి మళ్ళీ తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల తర్వాత మళ్ళీ చంద్రబాబు..తెలంగాణ జోలికి వెళ్లలేదు. కానీ ఈ మధ్య కేసీఆర్..టీఆర్ఎస్‌ పార్టీని కాస్త బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఈ పరిస్తితుల్లో బాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారు.

ఖమ్మంలో భారీ సభ పెట్టి సక్సెస్ చేశారు..అలాగే ఇతర పార్టీల్లోకి వెళ్ళిన టీడీపీ లీడర్లని మళ్ళీ వెనక్కి రావాలని పిలుపునిచ్చారు. అయితే బాబు తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వడంపై ఒక్క బీఆర్ఎస్ మాత్రమే తీవ్రంగా స్పందిస్తుంది..బాబుపై విమర్శలు చేస్తుంది. అలా బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించడం వెనుక కారణాలు ఉన్నాయి. తెలంగాణలో టీడీపీలో సగం పైనే నేతలు, క్యాడర్ వెళ్లింది బీఆర్ఎస్‌లోకే. ఇప్పుడు బాబు వెనక్కి వచ్చేయమంటున్నారు. దీంతో బీఆర్ఎస్‌కే నష్టం.

T & Mకి TDP ఆహ్వానం? | tummala nageswara rao and mandava venkateswara rao will join telugu desam? - Telugu Oneindia

పైగా తెలంగాణలో ఉన్న టీడీపీ శ్రేణులు వేరే ఆప్షన్ లేక మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు టీడీపీ యాక్టివ్ అయింది..దీంతో వారు కూడా ఇటు వచ్చేస్తారు. అందుకే బీఆర్ఎస్‌ నేతలు భయపడుతున్నారు. అసలే తెలంగాణలో హోరాహోరీ పోటీ ఉంది..ఈ సమయంలో ఒక్క ఓటు కూడా ముఖ్యమే. ఇప్పుడు సడన్ గా టీడీపీ వచ్చి కొందరు నాయకులని, కొన్ని ఓట్లు లాగితే డ్యామేజ్ కారుకే.

రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా నుంచి పోటీకి రెడీ అవుతున్న సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు | Senior leader Mandava Venkateswara Rao is preparing to contest from Nizamabad district in the upcoming elections– News18 Telugu

పైగా టీడీపీలో దశాబ్దాల పాటు పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరావు లాంటి వారు సైతం బీఆర్ఎస్‌లోకి వెళ్లారు. అయినా సరే వారి మనసు టీడీపీ వైపే ఉన్నట్లు తెలుస్తోంది. వారితో చంద్రబాబు టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక వారు గాని టీడీపీలోకి రిటర్న్ వస్తే బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ. మరి బీఆర్ఎస్ పార్టీ అక్కడ వరకు పరిస్తితి తెచ్చుకుంటుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news