పుష్ప మేకర్స్‌కు జోక్‌లా ఉందా?… విడుదల తేదీపై ఫ్యాన్స్ ఫైర్

-

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా పుష్ప2′ కొత్త రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది. 2024 డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్లో ఉన్న కారణంగా తొలుత ప్రకటించిన ఆగస్టు 15న సినిమా విడుదల చేయలేకపోతున్నామని వివరించింది.ఇక విడుదల తేదీ మళ్లీ పోస్ట్ఫోన్ కావడంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ట్వీటిర్‌లో నెటిజన్ రాస్తూ.. ‘పుష్ప-2 సినిమా జూన్ 2024లో విడుదల కావాల్సిన సినిమా. అసలు డిసెంబర్ 2024కి ఎందుకు మార్చారు. ఇదంతా పుష్ప మేకర్స్‌కు జోక్‌లా ఉందా? మీరు ప్రేక్షకుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు అని అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే పుష్ప-2 విడుదల చేయాలని కమ్యూనిటీ తరపున కోర్టులో కేసు వేస్తా’అంటూ అల్లు అర్జున్ పోస్ట్ కు రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. మరో నెటిజన్ రాస్తూ.. ‘ఇది మంచి పద్ధతి కాదు.. ఇంకా ఎన్నిసార్లు డేట్‌ మారుస్తారు’ అంటూ బన్నీ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version