కాంగ్రెస్‌దే అధికారం..రేవంత్ ఆశలు నెరవేరతాయా!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై దాదాపు 9 ఏళ్ళు అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని చివరిగా పాలించిన పార్టీగా మిగిలిన కాంగ్రెస్..తెలంగాణ వచ్చాక అధికారంలోకి రాలేదు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇలా రెండు సార్లు ప్రతిపక్షానికి పరిమితమైన కాంగ్రెస్ ఈ సారైనా అధికారంలోకి వస్తుందా? అంటే ప్రస్తుతం ఆ పరిస్తితులు కనిపించడం లేదు.

ఇంకా కాంగ్రెస్ పార్టీ వీక్ అయినట్లు కనిపిస్తుంది గాని బలపడినట్లు లేదు. అలా కాంగ్రెస్ పార్టీ పరిస్తితి అవ్వడానికి కారణం కాంగ్రెస్ నేతలే. వారు అంతర్గత విభేదాలతో పార్టీ భారీగా దెబ్బతింది. ఇప్పటికీ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి ఆడుతున్న పోలిటికల్ గేమ్ లో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది. ఇప్పుడు ఆ పరిస్తితి ఎలా వచ్చిందంటే మూడో స్థానానికి పరిమితమైనట్లు కనిపిస్తుంది. అయితే ఈ పరిస్తితి నుంచి గట్టెక్కించి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు వల్ల రేవంత్ సైతం దూకుడుగా పనిచేయలేని పరిస్తితి. ఇప్పటివరకు విభేదాలని చక్కదిద్దడమే సరిపోయింది. ఇప్పుడు ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. దీని ద్వారా పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలని చూస్తున్నారు. కానీ రేవంత్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుతుందో తెలియని పరిస్తితి.

అయితే క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం, క్యాడర్ ఉంది. బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉంది. కానీ నాయకులు సరిగ్గా పనిచేయకపోవడం, కుమ్ములాటలకు దిగడం పెద్ద మైనస్ అయింది. ఇలాంటి పరిస్తితుల్లో రేవంత్ పాదయాత్ర స్టార్ట్ చేశారు. రేవంత్ పాదయాత్రని మీడియా కూడా పెద్దగా కవర్ చేస్తున్నట్లు కనిపించడం లేదు. కాకపోతే స్థానికంగా పాదయాత్ర మొదటిరోజు భారీ స్పందన వచ్చింది. అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారమని రేవంత్ చెప్పుకొచ్చారు. కానీ పరిస్తితులు ఇలాగే ఉంటే అధికారం కష్టమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version