Love Today OTT : ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన యూత్ ఫుల్ హిట్ “లవ్ టుడే”.!

-

ఇటీవలే తమిళంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతున్న ‘లవ్ టుడే’ సినిమా తెలుగు విడుదలకు ముస్తాబవుతుంది. ప్రదీప్ రంగనాథన్ నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో నవంబర్ 4న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఈ చిత్రానికి తమిళ ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో తెలుగులో కూడా ఈ సినిమాను నవంబర్‌ 25వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమాను దిల్‌రాజ్‌ కొనుగోలు చేసి.. తెలుగులో రిలీజ్‌ చేశారు. అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చింది. నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీ సంస్థ ‘లవ్ టుడే’ సినిమాను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఓటీటీ అందుబాటులోకి రానుంది ‘లవ్ టుడే’ సినిమా.

Read more RELATED
Recommended to you

Latest news