అందుకే లవర్ బాయ్ తరుణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేశాడా..!!

-

లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో తరుణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి .. ఆ తర్వాత నువ్వే కావాలి అనే సినిమా ద్వారా సోలో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. డెబ్యూ సినిమాతోనే మంచి విజయం పొందిన తరుణ్ కి ఆ తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వే నువ్వే వంటి చిత్రాలతో ఏకంగా అమ్మాయిల మనసు దోచుకున్నాడు. తన చిలిపి నటనతో అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్. అందరూ కూడా త్వరలోనే అగ్ర కథానాయకుడిగా చెలామణీ అవుతాడు అని అనుకునే లోపే తరుణ్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల తన సినీ కెరీర్ మొత్తం స్పాయిల్ అయిందని చెప్పవచ్చు.

కథల ఎంపిక విషయంలో మొదట్లో చేసిన ప్రయత్నం ఆ తర్వాత చేయకపోవడం వల్లే అన్ని వరుస ఫ్లాప్ లను చూసి చివరికి ఇండస్ట్రీలో కనుమరుగయ్యాడు. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా అవకాశాలను అందిపుచ్చుకున్నప్పటికీ తన సినీ కెరీర్ ను మాత్రం కొనసాగించలేకపోయాడు. వరుసగా సినిమాలు డిజాస్టర్ లు మిగులుతుండడంతో చేసేదేమి లేక పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు తరుణ్. తరుణ్ చివరిసారిగా నటించిన సినిమా ఇది నా లవ్ స్టోరీ. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తరుణ్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అంతేకాదు ఈ సినిమా విడుదలై సుమారుగా ఐదు సంవత్సరాలు కూడా పూర్తయింది.

ఇక ఇండస్ట్రీలో అవకాశాలు లేక పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు తరుణ్. అంతేకాదు తన తండ్రి స్థాపించిన వ్యాపారాలను చూసుకుంటూ ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగాడు. మళ్లీ సినిమాల్లోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నట్లు అందుకోసం ఒక మంచి పాత్ర ఎంచుకున్న తర్వాత నే ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడు అని ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరొక వైపు వ్యాపారాలలో మంచి లాభార్జన ఉంది కాబట్టి ఇండస్ట్రీకి దూరం అయ్యాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక తరుణ్ మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతారో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Tarun , Business man

Read more RELATED
Recommended to you

Exit mobile version