ల్యాప్‌టాప్‌లో త్వరగా చార్జింగ్ అయిపోతుందా?కారణం ఏంటో తెలుసా?

-

కరోనా తర్వాత ఉద్యోగులకు అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది..దీంతో అందరు ఇంట్లోనే కుర్చొని వర్క్ చేశారు..ఎక్కువ మంది ల్యాప్‌టాప్‌ ల ద్వారానే వర్క్ చేస్తున్నారు..ల్యాప్‌టాప్‌ల వినియోగం చాలా పెరిగిపోయింది. డెస్క్‌టాప్‌ కంటే ల్యాప్‌టాప్‌పై పని చేసేందుకే జనం ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ల్యాప్‌టాప్‌ను ఎక్కడికంటే అక్కడికి ఈజీగా తీసుకెళ్లడమే ఇందుకు కారణం.అయితే కొత్త ల్యాప్‌టాప్‌లో బ్యాటరీ లైఫ్ సమస్య ఉండనప్పటికి కొద్దిగా పాతబడిన తరువాత బ్యాటరీ బ్యాకప్ ఇంతకుముందుల ఉండకపోవచ్చు లేదా ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవ్వడం మొదలవుతుంది.

ల్యాప్‌టాప్‌లో పనిచేసేటప్పుడు తరచుగా ప్రజలు బ్యాటరీతో సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మీ ల్యాప్‌టాప్ పాతబడటం ప్రారంభించినప్పుడు.. అందుకే మీరు ఎప్పటికప్పుడు మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ అంటే బ్యాటరీ లైఫ్‌కి సంబంధించిన హెల్త్ చెకప్‌ని చెక్ చేస్తూ ఉండాలి..ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చుద్దాము..

మీరు విండోస్ 10 వాడుతున్నట్లయితే..ఇందుకు మీరు సిస్టమ్‌లో కమాండ్ ప్రాంప్ట్‌ను మొదలు పెట్టాలి. దీని కోసం, విండోస్ సెర్చ్ లేదా స్టార్ట్ మెనూలో ‘cmd’ లేదా ‘కమాండ్ ప్రాంప్ట్’ని పరిశోధిస్తే.. మీరు ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే ఫైల్ పాత్‌తో కూడిన విండోను చూడవచ్చు. ఇది నలుపు రంగులో లేదా మరేదైనా రంగులో కూడా ఉంటుంది..విండో తెరిచిన తర్వాత, ఇక్కడ powercfg/batteryreport అని టైప్ చేసి ఎంటర్ చేయండి. దీని కారణంగా సేవ్ చేయబడిన బ్యాటరీ లైఫ్ రిపోర్ట్ మెసెజ్‌ మీ ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనితో పాటు, స్క్రీన్‌పై ఫైల్ పాత్ కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు బ్యాటరీ రిపోర్ట్ చూడవచ్చు. ఇది కాకుండా, మీరు యూజర్ ఫోల్డర్‌కి వెళ్లి C:Users[Your_User_Name]battery-report.html అని టైప్ చేయడం ద్వారా కూడా బ్యాటరీ స్థితిని చూడవచ్చు..

మీరు ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ద్వారా కూడా ఈ ఫోల్డర్‌ని చూడవచ్చు. ఈ సిస్టమ్ రూపొందించిన నివేదికలో.. బ్యాటరీ వినియోగం వారీగా గ్రాఫిక్స్ ద్వారా చూపబడుతుంది.. ప్రస్తుత స్థితి గురించి కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు..మీరు బ్యాటరీని, పరికరాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో కూడా ఇది చూపించే నివేదికలో నమోదు తెలిసిపోతుంది. దీనితో పాటు, మీరు ల్యాప్‌టాప్ AC ఛార్జర్‌లో రన్ అయ్యే సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. బ్యాటరీ, AC ఛార్జర్ రెండింటినీ పోల్చడం ద్వారా మీరు ల్యాప్‌టాప్ బ్యాటరీ పవర్ కెపాసిటీ స్థితిని అర్థం చేసుకోవచ్చు..ఇలా మీ బ్యాటరీ గురించి తెలుసుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version