చూపే బంగారమాయనే..! పాటలో కాదు..నిజ జీవితంలోనే..!

-

చూపే బంగారమాయెనే అని మనం పాట మాత్రమే పాడుకున్నాం..కానీ ఆమె చూపు నిజంగానే బంగారం అయింది.. బంగారంతో కృత్తిమ కన్ను వేయించుకుంది ఓ యువతి. ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్‌లో నివసించే “డానీ విన్రో”అనే మహిళ కృత్రిమ బంగారపు కన్ను వేసుకుంది. చిన్నతనంలో అనారోగ్యం కారణంగా ఆమెకు ఒక కన్ను తొలగించారు. లివర్‌పూల్ నివాసి డానీ విన్రో గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
డానీకి కేవలం 6 నెలల వయస్సులో రెటినోబ్లాస్టోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది ఒక రకమైన అరుదైన కంటి క్యాన్సర్. దీంతో వైద్యులు ఆమెకు ఒక కన్ను పూర్తిగా తొలగించారు. ఆ తర్వాత వైద్యులు ఆమెకు కృత్రిమ కన్ను వేశారు. కూతురి ప్రాణాలను కాపాడేందుకు తల్లిదండ్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ డానీ ఈ కన్నుతో ఎప్పుడూ సంతోషంగా లేదు. ఇప్పుడు డానీ తన కృత్రిమ కంటిని బంగారంతో భర్తీ చేసింది. డానీ తన బంగారు కన్ను ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది పిచ్చ వైరల్ అయ్యింది. డానీ కన్ను నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.
డానీ కన్ను తొలగించబడినప్పుడు ఆమె వయస్సు కేవలం 6 నెలలు మాత్రమే. . శస్త్రచికిత్స తర్వాత డానీకి గాజు కన్ను అమర్చారు. అయితే ఇది చూసి డానీని తోటి విద్యార్థులు ఎగతాళి చేసేవారట. అయితే భవిష్యత్తులో కూడా కృత్రిమ కన్ను కారణంగా ప్రజలు తనను ఎగతాళి చేస్తారని ఆమె అనుకుందట.. అందుకే బంగారంతో కూడిన కన్ను వేయించుకుంది. ఈ బంగారు కన్నుతో తాను చాలా సౌకర్యంగా ఉన్నట్లు డానీ తెలిపింది. ఈ కంటికి డానీ 15 వేలు ఖర్చు పెట్టిందట. ఇప్పుడు తన లుక్‌తో చాలా హ్యాపీగా ఉందట.
మొత్తానికి డానీ తన చూపును బంగారం చేసేసుకుంది. మనలో ఉన్న లోపానికి బాధపడుకుండా దానిని కూడా ఇలా మార్చుకోవడం చాలా తక్కువ మందే చేస్తారు. చిన్నప్పటి నుంచి ఎన్నో వెక్కిరింతలు, ఎగతాళ్లు భరించిన డానీ ఇప్పుడు తన బంగారు కంటితో అందరి నోళ్లూ మూయించేసింది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news