కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవ్వరితరం కాదు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

-

కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరమూ కాదని తేల్చి చెప్పారు. ప్రజల మద్దతు అధికారంలోకి వచ్చామని.. ఐదేళ్లు పాలిస్తామని అన్నారు. ప్రజల తమపై నమ్మకంతో అధికారం ఇచ్చారని.. సంపద సృష్టించి వాళ్లు అందిస్తామన్నారు.  దేశంలో రిజర్వేషన్ల రద్దు బీజేజీ అంజెడా అని విమర్శించారు. రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ బీజేపీకి వత్తాసు పలకడం సిగ్గు చేటు అని విమర్శించారు.

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటేస్తే భవిష్యత్ ఉండదని.. దేశంలోని బలహీన వర్గాలు, దళిత, గిరిజనులు తమ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణలో కుల గణన ప్రక్రియ ప్రారంభమైందని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలుస్తోందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news