కేంద్ర ఐటీ మినిస్టర్ కి షాక్ ఇచ్చిన ట్విట్టర్..

కేంద్ర సమాచార సాంకేతిన శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కి ట్విట్టర్ షాక్ ఇచ్చింది. గంట పాటు అకౌంట్ ఓపెన్ చేయనీయకుండా బ్లాక్ చేసింది. ఈ మేరకు రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఉదయం ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేద్దామని ప్రయత్నిస్తుంటే వీలు కాలేదు. సడెన్ గా నా అకౌంట్ లాక్ అయినట్టు మెసేజ్ చూపించింది. గంట తర్వాత మళ్ళీ తన అకౌంట్ ఓపెన్ అయ్యిందని, అసలు ఎందుకలా అయ్యిందో అర్థం కాలేదు.

ఇది భారతీయ సమాచార సాంకేతిక చట్టం 2021 ప్రకారం చట్ట విరుద్ధమని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక వ్యక్తి అకౌంట్ ని నిలిపివేయడం సరైన చర్య కాదని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ మెసేజీలను స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విషయమై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. ట్విట్టర్ చేసినది సరైన చర్య కాదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా భారత ప్రభుత్వానికి ట్విట్టర్ కి మధ్య విభేధాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే.