‘మైత్రీ మూవీ మేకర్స్’ ఆఫీసులో రెండోరోజు ఐటీ సోదాలు

-

హైదరాబాద్​లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప సినిమా బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ సుకుమార్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు రెండో రోజు సోదాలు నిర్వహిస్తున్నారు. సంస్థ వ్యాపార లావాదేవీలు, ఆదాయపన్ను చెల్లింపుల్లో భారీ వ్యత్యాసాలున్నాయన్న సమాచారంతో కేంద్ర ఐటీ అధికారులు జూబ్లీహిల్స్ లోని మైత్రీ మూవీ కార్యాలయంలో తనిఖీలు చేస్తోంది.

బుధవారం రోజున ఆ సంస్థ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. గతేడాది డిసెంబర్ లోనూ ఈ సంస్థలో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు.. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది వ్యక్తిగత వివరాలు, వ్యాపార లావాదేవీలపై ఆరా అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అటు దర్శకుడు సుకుమార్‌ ఇంట్లోనూ రెండోరోజూ సోదాలు నిర్వహిస్తున్నారు.

దర్శకుడు సుకుమార్ కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉండటం, సొంతగా సుకుమార్ రైటింగ్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించడంతో వాటి ఆర్థిక లావాదేవీల వివరాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఐటీ అధికారుల తనిఖీలపై మైత్రీ మూవీ మేకర్స్ కానీ, దర్శకుడు సుకుమార్ కానీ అధికారికంగా స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version