గొప్పది అని చాటండి..ఆహా ! ఏమి రియలైజేషన్.. ఇదంతా అల్లు అరవింద్ అనే మెగా ప్రొడ్యూసర్ ప్రాథేయపడుతూ విన్రమపూర్వకంగా చెప్పిన మాట !
– నా సినిమాను బతికించండి అని వేడుకోవడం ఇప్పుడొక ఆనవాయితీ అయిపోయింది. సినిమాలో కథ బాగుంటే సినిమా బాగుంటుంది.. కథతో పాటు చెప్పే విషయంపై ప్రచారం కూడా బాగుండాలి. అన్నింటి కన్నా టికెట్ ధర ఆకాశాన్ని తాకే విధంగా కాకుండా నేలకు దిగి వచ్చే విధంగా ఉండాలి. నేలపై ధరలు ఉంటే, నేలబారు ఫలితాలు అయితే రావు. అందుకే జగన్ తన ఆలోచన మేరకు కొన్ని ప్రతిపాదనలు చేసి టికెట్ ధరలు తగ్గించి ఉంటారు అని అంటోంది ఓ వర్గం.
– కానీ ఇప్పుడు అవే ధరలు మళ్లీ అమల్లోకి వస్తే.. తెస్తే.. చిన్న సినిమా బతికి ఒడ్డెక్కుతుంది. పెద్ద సినిమా కూడా అదే ధరకు ఆడి ఒడ్డెక్కిన దాఖలాలు ఉన్నాయి. అందుకు అఖండ అనే పెద్ద సినిమానే ఉదాహరణ. కనుక టికెట్ ధర కన్నా కంటెంట్ ముఖ్యం. కటౌట్లు చూసి నమ్మేయాలి డ్యూడ్ అంటే జరగని పని ! బాబులు సినిమా ప్రమోషన్లలో భాగం అయితే మేలు. అప్పుడు చిన్న, పెద్ద అన్న తేడాలు ఉండక సినిమా ఆర్థికంగా ఒడ్డెక్కడం ఖాయం.
– సినిమా అనే మూడక్షరాల ప్రపంచం చుట్టూనే చాలా జరిగిపోతున్నాయి. చాలా జరగకుండా ఉండిపోతున్నాయి కూడా ! డబ్బు లుంటే సినిమా అన్న మాట కన్నా విలువలుంటే సినిమా అన్న మాటకు వాల్యూ పెరిగింది. వాల్యూ యాడ్ అయింది కూడా ! ఆ విధంగా తెలుగు సినిమా ప్రపంచం ఇప్పుడు అంతర్మథనం నుంచి ఆత్మావలోకనం వరకూ వచ్చింది. ఆ విధంగా తెలుగు సినిమా ఆత్మరక్షణ ధోరణిలో పడింది. ఇప్పుడు అంతా సినిమాను కాపాడుకునే పనులు కొన్ని చేయాలి. చేస్తున్నారు కూడా ! సినిమా ను నమ్ముకుని, నిలుపుకునే పనులు కొన్ని చేయాలి..చేస్తున్నారు కూడా! ఇప్పుడిక డబ్బులు పెడితే సినిమా కాదు మనసుకు చేరువ అయితేనే సినిమా ! ఈ మాట అరవింద్ అనే నిర్మాత ఒప్పుకుంటున్నారు. ఇంకా ఇంకొందరు ఒప్పుకోవాల్సిందే !