తెలుగుదేశం ‘బాధలే బాధలు ‘ అని పెట్టుకుంటే బాగుండేది: గుడివాడ అమర్నాథ్

-

టీడీపీ అధినేత చంద్రబాబుపై పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని వ్యాఖ్యానించారు. ఏ ముఖం పెట్టుకుని ఉత్తరాంధ్ర లో పర్యటిస్తారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తూ నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. గతంలో విశాఖ వస్తే ఉత్తరాంధ్ర ప్రజలు తరిమి కొట్టారు అని గుర్తు చేశారు. బాదుడే బాదుడు అనేకంటే తెలుగుదేశం ‘బాధలే బాధలు ‘ అని పేరు పెట్టుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనే తాపత్రయంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ప్రజలు ఇప్పుడు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. ఎన్ని కష్టాల్లో ఉన్న ప్రజల సంక్షేమమే ముఖ్యం అని భావించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు భరోసా కల్పించారన్నారు. అధికారం కోసం చంద్రబాబు పాకులాడుతున్నారని.. అది కలగానే మిగిలిపోతుంది అని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version