బిగ్ బ్రేక్ : జ‌గ‌న్ వెర్స‌స్ జ‌బ‌ర్ద‌స్త్

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ పై జబర్దస్త్ నటుడు అప్పారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చింతామణి నాటకం నిషేధంపై తీసుకున్న నిర్ణయాన్ని జగన్‌ సర్కార్‌ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖలో చింతామణి నాటకం నిషేధంపై కళా కారులు, తెలుగు భాష ప్రేమికుల నిరసన తెలిపారు. అటు మద్దిలపాలెం జంక్షన్ లో తెలుగు తల్లి విగ్రహం దగ్గర నిరసన చేపట్టింది తెలుగు దండు.

ఈ సందర్భంగా జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ… 1920 లో మహాకవి కాళ్ళకూరి నారాయణ రావు గారు ఈ నాటకాన్ని రాశారని.. మొదటిసారి ఆ నాటకంలో కాళ్ళకూరి నారాయణ రావు గారు నటించారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం చాలా బాధాకరమని.. ఈ ప్రభుత్వం సంఘీ భావం తో కూడిన మీటింగ్ పెట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. కళాకారులను,కళల ను ప్రోత్సహించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆకాంక్షిస్తున్నానని వెల్లడిం చారు.