ప్లీనరీ ‘పవర్’: జగన్ అక్కడే తేల్చేస్తారా?

-

ఏపీలో వైసీపీ-టీడీపీల మధ్య వార్ రోజురోజుకూ పెరుగుతుంది…ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…రెండు పార్టీలు ఎన్నికలే టార్గెట్ గా రాజకీయం చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నాయి. ఈ క్రమంలోనే రెండు పార్టీలు ఎప్పటికప్పుడు సరికొత్త రాజకీయ ఎత్తులతో వస్తున్నాయి. అయితే ఈ సారి అధికారం దక్కించుకోవడం అనేది టీడీపీకి చాలా అవసరం …ఈ సారి గాని అధికారం దక్కకపోతే టీడీపీ భవిష్యత్తుకే ప్రమాదం. అందుకే అధినేత చంద్రబాబు..ఈ వయసులో కూడా పార్టీని గాడిలో పెట్టేందుకు కష్టపడుతున్నారు.

అలాగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే జనంలోకి వెళుతూ…భారీ సభలు ఏర్పాటు చేసుకుని ముందుకెళుతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పేరిట..ఏడాది పొడవునా మినీ మహానాడు సభలని నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఒంగోలులో జరిగిన మహానాడు విజయవంతం అయింది..ఇక తర్వాత చోడవరంలో జరిగిన మినీ మహానాడు కూడా సక్సెస్ అయింది..అక్కడ నుంచి వరుసపెట్టి ఆయా జిల్లాల్లో మినీ మహానాడులు జరిపేందుకు టీడీపీ ప్లాన్ చేసుకుంది.

ఇక టీడీపీకి ధీటుగా అధికార వైసీపీ సైతం..నియోజకవర్గాల వారీగా ప్లీనరీ సమావేశాలని నిర్వహిస్తుంది. అయితే ఈ ప్లీనరీ సమావేశాలు పూర్తిగా సక్సెస్ అవుతున్నట్లు కనిపించడం లేదు. పైగా సొంత పార్టీలోని లుకలుకలు బయటపడే వేదికలుగా ప్లీనరే సమావేశాలు మారుతున్నాయి. ఎమ్మేల్యేలు, మంత్రులు పార్టీలో ఉన్న తప్పులని ఎత్తిచూపే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే సొంత పార్టీ వాళ్లే తమని ఓడించడానికి చూస్తున్నారని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని, కాంట్రాక్టులు చేసిన కార్యకర్తలు బిల్లులు రాక అప్పులు పాలవుతున్నారని, పథకాల వల్ల జగన్ గ్రాఫ్ పెరుగుతుంది తప్ప…తమ గ్రాఫ్ పెరగడం లేదని వాపోతున్నారు. ఇలా ప్లీనరీ సమావేశాల్లో వైసీపీలో ఉన్న లోపాలు బయటపడుతున్నాయి. అయితే వీటి అన్నిటికి ఈ నెల 8న గుంటూరు జరగనున్న రాష్ట్ర ప్లీనరీ సమావేశంలో జగన్ సమాధానం చెప్పే అవకాశాలు ఉన్నాయి. మహానాడు కంటే భారీగా ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించడానికి వైసీపీ సిద్ధమైంది. ఆ సమావేశంలోనే ఎమ్మెల్యేల మధ్య పోరుకు చెక్ పెట్టి, పార్టీని లైన్ లో పెట్టేందుకు జగన్ కొత్త స్కెచ్ తో ముందుకు వస్తారని తెలుస్తోంది. చూడాలి మరి ఆ ప్లీనరీ సమావేశాల తర్వాత వైసీపీ గాడిలో పడుతుందేమో.

Read more RELATED
Recommended to you

Latest news