విగ్గు తీసేస్తే ఇంట్లో వాళ్లు కూడా గుర్తుపట్టరు – రఘురామపై సాయిరెడ్డి సెటైర్లు

-

విగ్గు తీసేస్తే ఇంట్లో వాళ్లు కూడా గుర్తుపట్టరని రఘురామపై విజయసాయిరెడ్డి సెటైర్లు విసిరారు. లాయర్లు, కెమెరాలు, మారువేషాల్లో పచ్చ పార్టీ గూండాలు, ఇంత భారీ షూటింగ్ అవసరమా పెగ్గూ? విగ్గు, పెట్టుడు మీసాలు తీసేస్తే ఇంట్లో వాళ్లు కూడా గుర్తుపట్టరు. పోలీసులకు మరీ కష్టం. మలేరియా రోగిలా వణుకుతున్నావు. పోతావేమో డాక్టర్ల బృందాన్నీ వెంటపెట్టుకుని రా అంటూ సవాల్‌ విసిరారు విజయసాయిరెడ్డి.

ఓట్లు వేసిన ప్రజల దగ్గరకు వెళ్లాలన్నా భయపడే బదులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవచ్చుగా. సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి కోర్టుకి వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్నాడు విగ్గు – పెగ్గు రాజు. మేకపోతు గాంభీర్యంతో ఢిల్లీ పచ్చ మీడియా ముందు అవాకులు చెవాకులు పేలడం తప్ప ఏమీరాని దద్దమ్మ అంటూ ఫైర్‌ అయ్యారు.

టీడీపీని జనం చెప్పుతో కొట్టినప్పుడల్లా కరకట్ట అక్రమకొంపలో ఎదో కథనం వండుతారు. దాన్ని ‘అంధ’జ్యోతిలో మోస్తారు. అసంతృప్తి వైసీపీలో కాదు చంద్రబాబు,రాధాకృష్ణ మెదళ్లలో ఉంది. కుక్కతోకలాగే వారి బుద్దీ వంకరే. మొన్నటిదాకా ఉద్యోగుల్లో అసంతృప్తన్నారు. ఆత్మకూరు ఫలితం తర్వాత నోరు మూసుకున్నారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news