విశాఖలో కాపురం..జగన్ మరో డైవర్షన్ గేమ్.!

-

రాజకీయంగా ఏమైనా ఇబ్బందులు వస్తే..వాటిని డైవర్ట్ చేయడానికి చాలా కష్టపడాలి. కానీ అలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో వైసీపీని మించిన పార్టీ లేదని తెలుస్తోంది. పరిస్తితులు తమకు అనుకూలంగా లేకపోతే కొత్త అంశాలని తెరపైకి తీసుకొచ్చి వాటిపై చర్చ జరిగేలా చేసి..పాత అంశాలని డైవర్ట్ చేస్తారు. అలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని టి‌డి‌పి శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

ఎందుకంటే ఈ మధ్య కాలంలో వైఎస్ వివేకా హత్య కేసుపై ఎలాంటి చర్చలు నడుస్తున్నాయో తెలిసిందే. గత ఎన్నికల ముందు వివేకాని చంద్రబాబు, టి‌డి‌పి నేతలు చంపించారని జగన్ తో సహ వైసీపీ నేతలు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ది పొందారు. కానీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక వివేకా కేసు ఊసు లేదు. కానీ వివేకా కుమార్తె సునీత పొరాడి..సి‌బి‌ఐ విచారణ వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు  ఈ కేసులో జగన్ మరో బాబాయి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు. దీంతో ఇది వైసీపీకి రివర్స్ అవ్వడం మొదలైంది. ఇక జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి.. ఈ కేసులో చిక్కుకుంటున్నట్లు కనిపిస్తున్నారు.

May be an image of 2 people and dais

ఆయన అరెస్ట్ కూడా జరుగుతుందని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. అరెస్ట్ కాకుండా అవినాశ్ ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు 25వ తేదీన తీర్పు ఇస్తామని చెప్పింది. అలాగే వరుసగా సి‌బి‌ఐ విచారణ జరగనుంది. ఇక అవినాష్ అరెస్ట్ అయినా, కాకపోయినా వివేకా కేసులో వైసీపీకే పెద్ద మైనస అవుతుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ..మళ్ళీ మూడు రాజధానుల ఊసు ఎట్టారు. తాజాగా శ్రీకాకుళంకు వెళ్ళిన ఆయన..సెప్టెంబర్ నెల నుంచి విశాఖలో కాపురం పెడతానని చెప్పుకొచ్చారు. దీంతో ఇపుడు విశాఖ రాజధాని అనే అంశంపై చర్చ మొదలైంది. అలా చర్చ మొదలయ్యేలా జగనే చేశారని, వివేకా హత్య కేసుని డైవర్ట్ చేశారని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news