‘ఇంగ్లీష్’ పాలిటిక్స్: జగనే కేసీఆర్‌ని ఫాలో అవ్వాలి…!

-

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో కొన్నిటికి ప్రతిపక్ష టీడీపీ బ్రేకులు వేస్తూ వచ్చింది. కోర్టుల్లో కూడా జగన్ నిర్ణయాలకు బ్రేకులు పడ్డాయి. అలా జగన్ తీసుకున్న ఇంగ్లీష్ మీడియం నిర్ణయానికి కూడా బ్రేక్ పడింది. అదిగో పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యని అందిస్తామంటే టీడీపీ అడ్డుపడుతుందని వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు.

jagan
jagan

అయితే తాజాగా జగన్ రూట్‌లోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. ఇక ఇంగ్లీష్ మీడియం విద్యని అమలు చేయడం మాటలు కాదు…దానికి తగ్గట్టు వసతులు ఏర్పాటు చేసుకోవాలి..అలాగే ఉపాధ్యాయులకు ఇంగ్లీష్‌ మీడియం భోదనపై ట్రైనింగ్ ఇవ్వాలి. ఇదంతా పూర్తి అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. అదే సమయంలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇతర తరగతుల్లో తెలుగుమీడియంలో చదువుతున్న వారు ఇంగ్లిష్‌ మీడియంలోకి మారాలంటే అందుకు అవకాశం ఉంటుందా? లేదా? అనేది క్లారిటీ ఇవ్వాలి.

అయితే తెలంగాణలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై ఏపీ మంత్రులు స్పందిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణలో కూడా అడ్డుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా జగన్‌నే ఫాలో అవుతున్నారని చెబుతున్నారు. అవును జగన్‌నే ఫాలో అవుతున్నారు..కాకపోతే జగన్ కూడా ఫాలో అవ్వాల్సిన విషయం కూడా ఉంది.

అది ఏంటంటే…జగన్ ప్రభుత్వం పూర్తిగా తెలుగు మీడియం తీసేసి..కేవలం ఇంగ్లీష్ మీడియంని అమలు చేయాలని చూస్తోంది. అదే టీడీపీ వ్యతిరేకిస్తుంది. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంని కంటిన్యూ చేయాలని కోరుతున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం అదిగో ఇంగ్లీష్ మీడియంకు అడ్డుపడుతున్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణలో తెలుగు మీడియంని కొనసాగిస్తూనే, ఇంగ్లీష్ మీడియంని తీసుకొస్తున్నారు. ఈ తేడా వైసీపీ నేతలు గమనించలేదు అనుకుంటా…కాబట్టి పిల్లలకు రెండు ఆప్షన్స్ ఉండాలి…అప్పుడు వారికి నచ్చింది ఎంచుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news