అర్హులై వివిధ కారణాల వల్ల ప్రభుత్వ పథకాలు పొందలేక పోయిన వారికి సీఎం జగన్ శుభవార్తా చెప్పారు. ప్రభుత్వ పథకాలు పొందలేక పోయిన 9,30,809 మంది ఖాతాల్లో రూ. 703 కోట్లను జమ చేశారు సిఎం జగన్. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. గతంలో పథకాలకోసం ప్రజలు ఎదురు చూసేవారని.. ఇప్పుడు ప్రజలనే నేరుగా వెతుక్కుంటూ పథకాలు వస్తున్నాయని చెప్పారు. ఈ పథకాలు అమలు చేసేటప్పుడు మనం కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడ్డం లేదన్నారు.
అర్హత ఉంటే చాలు, సంక్షేమ పథకాలు అందరికీ దక్కుతాయన్న కోణంలోనే ప్రతి అడుగూ వేస్తున్నామని వెల్లడించారు. ఇంకా ఎక్కడైనా అర్హులై ఉండి కూడా దరఖాస్తు చేసుకోలేకపోవడమో, అర్హత నిర్ధారణలో జరిగిన పొరపాట్లవలనో, నిర్ణీత సమయంలోగా దరఖాస్తు చేసుకోకపోవడంవల్లో, బ్యాంకు ఖాతాలు సరిగ్గా లేపోవడం వల్లో ఇలా ఏ కారణాలు అయినా సరే అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందనట్టు అయితే అటువంటి వారు అందరూ కూడా మిస్‌కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఇది గొప్ప విప్లవాత్మక మార్పు అని.. గతంలో ప్రభుత్వాలు.. ఎలా కత్తిరించాలి అని ఆలోచించేవన్నారు. ఎవరూ మిగిలిపోకూడదు, అర్హులకు అందరికీ అందలాన్న తపన, తాపత్రయం ఈ ప్రభుత్వంలో ఉందని వెల్లడించారు.