అమరావతి ప్రాంత పేదలకు సొంత ఇండ్లు.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

-

అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది.

గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కృష్ణాయ పాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో 900.97ఎకరాలను గృహ అవసరాలకు అనుగుణంగా వినియోగించేలా సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ లోని జోన్లలో మార్పులు చేసింది.

ఈ మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న ఆఫర్టబుల్, ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ జోన్ తో పాటు రెసిడెన్షియల్ జోన్ నిబంధనలో మార్పులు చేస్తూ కొత్త జోన్ ను తీసుకురానుంది. దీనిపై నవంబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news