పార్టీ పటిష్టత పై జగన్ ఫోకస్ చేశారు. ఇక పై వైసీపీ పార్టీలోనూ వాలంటీర్ వ్యవస్థ తీసుకురానున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక పార్టీ ప్రతినిధి ఉండేలా సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు దిశగా కసరత్తు మొదలు పెట్టారు.
ఇందులో భాగంగానే, ఇవాళ పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు,175 నియోజకవర్గాల పరిశీలకులతో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి జగన్.
వాలంటీర్ వ్యవస్థలా ప్రతి 50 ఏళ్ళకు ఒక పార్టీ ప్రతినిధి, బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటు, మరింత విస్తృత రూపంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తీసుకుని వెళ్ళటం పై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.