హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. నగరంలో ప్రయాణికులకు అత్యంత కీలకమైన ఎంఎంటీఎస్ సేవలను పునరుద్ధరించింది. దీంతో హైదరాబాద్ వాసులు ప్రయాణం మరింత సులభం కానుంది. గతంలో ఎంఎంటీఎస్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా 86 ఎంఎంటీఎస్ సేవలను పునరుద్ధరించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. లింగంపల్లి- ఫలక్నుమా మొదటి రైలు ఉదయం 5.50కి మొదలు కాగా.. రాత్రి 9.45కు చివరి రైల్ అందుబాటులో ఉంటుంది. ఇదే విధంగా ఫలక్నుమా – లింగంపల్లి మొదటి రైలు ఉదయం 6.40కి, చివరి రైలు రాత్రి 10.35 వరకు, లింగంపల్లి- హైదరాబాద్ మొదటి రైలు ఉదయం 6.40కి, చివరి రైలు రాత్రి 9.25కు, హైదరాబాద్ – లింగంపల్లి మొదటి రైలు ఉదయం 5.40కి, చివరి రైలు రాత్రి 10.15కి, సికింద్రాబాద్ – హైదరాబాద్ ఉదయం 5 గంటలకు, ఫలక్నుమా- హైదరాబాద్ సాయంత్రం 4.35 వరకు సర్వీసులు ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రస్తుతం పెరిగిన ఆర్టీసీ ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఇది ఊరటనిచ్చే విషయం.
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్…. 86 ఎంఎంటీఎస్ రైళ్ల పునరుద్దరణ
-