ఏపీ వ్యాపారస్థులకు జగన్ సర్కార్ బిగ్ షాక్..వారికి రూ. 25 వేల మేర జరిమానా

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి నిరోధానికి మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసింది జగన్ ప్రభుత్వం. కేంద్ర హోమ్ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని వారికి రూ. 100 జరిమాన విధింపునకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీ వ్యాపారస్థులకు షాక్ ఇచ్చింది సర్కార్.

మాస్కు లేని వారిని దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే సదరు యాజమాన్యానికి రూ. 10 వేల నుంచి రూ. 25 వేల మేర జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఉల్లంఘనలు జరిగిన వ్యాపార, వాణిజ్య సంస్థలను 2 రోజుల పాటు మూసేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దుకాణాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో జరిగే ఉల్లంఘనలను 8010968295 నెంబరుకు వాట్సప్ ద్వారా తెలియచేయలని సూచించింది ప్రభుత్వం. ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనలు జరిగితే విపత్తు నిర్వహణ, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్టు వెల్లడిం చింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఈ అంశాలను పర్యవేక్షించాలని సూచనలు చేసింది సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news