నేడు ఉద్యోగులతో జగన్ సర్కార్ చర్చలు.. పీఆర్సీపై కీలక ప్రకటన

-

అమరావతి : ఇవాళ ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు జరుగనున్నాయి. చర్చలకు రావాల్సిందిగా ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పంపింది ఏపీ ప్రభుత్వం. లిఖిత పూర్వకంగా ఆహ్వానిస్తేనే వస్తామని స్టీరింగ్ కమిటీ పేర్కొంది. దీంతో లిఖిత పూర్వక ఆహ్వానం పంపింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సమావేశం జరుగనుంది. ఆహ్వానం అందిందని ధృవీకరించింది స్టీరింగ్ కమిటీ.

ఇక ఈ నేపథ్యంలోనే.. పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు మాట్లాడుతూ… పీఆర్సీ సాధన సమితి తరపున ఇద్దరు సీనియర్ అడ్వకేట్లను నియమించామని చెప్పారు. ఛలో విజయవాడను భారీ ఎత్తున నిర్వహించబోతున్నామని వెల్లడించారు. ఛలో విజయవాడ ఎంత ఎక్కువగా సక్సెస్ అయితే.. ఆ స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి కలుగుతుందని పేర్కొన్నారు. రాతపూర్వకంగా ఆహ్వానం పంపితే చర్చలకు వెళ్తామన్నారు. చర్చలకు వెళ్లి జీవోలు అబెయన్సు లో పెట్టాలని.. పీఆర్సీ నివేదిక బయటపెట్టాలని.. పాత జీతాలు ఇవ్వాలనే చెబుతామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news