ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరగాలి అని బలంగా నమ్మిన వైయస్ జగన్ కి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు మరియు పార్టీలకతీతంగా సీనియర్ రాజకీయ నేతలు కూడా జగన్ తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ అని మద్దతు తెలుపుతున్నారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో అప్పటి పాలకులంతా హైదరాబాద్ నగరాన్ని మాత్రమే అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పరిమితమయ్యిందో మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాల దెబ్బతిందని అయితే భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి దెబ్బలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగలకూడని అదే విధంగా ప్రజల మధ్య ఎటువంటి విద్వేషాలు వచ్చేలా ఉండకూడదని వైయస్ జగన్ తీసుకున్న 3 రాజధానిలో నిర్ణయం చాలా హైలెట్ అని గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అందించిన సభ్యులు జగన్ తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ అని ప్రశంసిస్తున్నారు. ఇంకా చాలామంది ప్రజా సంఘ మేధావులు ఓటర్ రాజధానుల కాన్సెప్ట్ చాలా బెస్ట్ కాన్సెప్ట్ అని కామెంట్ చేస్తున్నారు.