దమ్ముంటే గన్ మెన్లు లేకుండా ఓయూ రా.. బాల్క సుమన్ కు జగ్గారెడ్డి సవాల్

-

ప్రభుత్వ విప్ టీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇప్పటికే డప్పు కొట్టి ఎమ్మెల్యేవు అయ్యావని.. ఇంకా డప్పుకొట్టి మంత్రి అవుదాం అని అనుకుంటున్నాడని.. కేసీఆర్ మెప్పు కోసం స్థాయి మరిచి మాట్లాడుతున్నాడని జగ్గారెడ్డి విమర్శించారు. బాల్క సుమన్ కు దమ్ముంటే ఆర్ట్స్  కాలేజీ ముందుకు గన్ మెన్లు లేకుండా రా… అని సవాల్ విసిరారు. మా విద్యార్థి సంఘాల నాయకులే చూసుకుంటారని హెచ్చరించారు.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

పెద్దోళ్లను తిట్టి పెద్దోడు అవ్వాలని అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దగ్గర మెప్పు కోసం మర్డర్లు  చేసినా నువ్వా మాట్లాడేది అంటూ విమర్శలు చేశారు. విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన నువ్వు విద్యార్థుల కోసం కొట్లాడవా… కేసీఆర్ భజనే చేస్తావా..? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కు రాహుల్ గాంధీ పట్ల గౌరవం ఉంటే అనుమతి ఇస్తారని జగ్గారెడ్డి అన్నారు. యూనివర్సిటీ లో రాహుల్ గాంధీ పర్యటన అనుమతిపై ఇప్పటి వరకు వీసీ క్లారిటీ ఇవ్వలేదని… అనుమతి కోసం 5 రోజులు కావాలా..? అంటూ ప్రశ్నించారు. వీసీని కూడా టీఆర్ఎస్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news