ఐఏఎస్ లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదిస్తున్నారు…. ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు

-

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఐఏఎస్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఐఏఎస్ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు.  అధికారాలను మరిచిపోతున్నారని విమర్శించారు. ఉద్యోగాలన్ని పాలను మర్చిపోయి కోట్ల రూపాయాలను సంపాదించే ధ్యేయంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారం ఉంది కదా అని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలకు చదువులు చెప్పే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో  టీచర్లుగా పనిచేస్తున్న 950 మంది అధ్యాపకులను, ఉపాధ్యాయులను అకారణంగా తొలగించారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ లపై ప్రధాని మోదీ , ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ఫిర్యాదు చేయనున్నట్లు కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముందు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో తొలగించిన ఉపాధ్యాయులతో కలిసి ఆర్ కృష్ణయ్య ధర్నా నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news