టీ కాంగ్రెస్ ఫైట్..జగ్గారెడ్డి దేనికైనా సిద్ధపడ్డారా

-

జగ్గారెడ్డి దేనికైనా సిద్ధపడ్డారా.. ఓ వైపు అధిష్టానం నుండి హెచ్చరికలు జారీ చేస్తున్నా తన పంథా ను అలాగే కొనసాగించడం అంటే తన దారి తాను చూసుకోవాలి అని డిసైడ్ అయ్యారా..? టీకాంగ్రెస్లో ఇప్పుడు జగ్గారెడ్డి పై హాట్‌ హాట్‌ చర్చ సాగుతోంది.

పీసీసీ చీఫ్ నియామకం పై కసరత్తు మొదలయినప్పటి నుండి తన స్వరం గట్టిగా వినిపిస్తున్నారు జగ్గారెడ్డి. తన అభిప్రాయాలు చెప్పడంతో పాటు..సీఎల్పీలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశం తర్వాత సీరియస్ కామెంట్స్ చేశారు. ఠాగూర్ చేస్తున్న అభిప్రాయ సేకరణ మీద అనుమానం ఉందంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రచ్చకు దారి తీసింది. దీనిపై ఇంఛార్జి ఠాగూర్ కూడా జగ్గారెడ్డి కోపంగానే ఉన్నారు.

సంగారెడ్డిలో తన తొలి పర్యటనలోనే జగ్గారెడ్డికి మంత్రి పదవి అని ప్రకటిస్తే… ఆయన నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తారా.. అని ఒకింత గుర్రుగా ఉన్నారు. దీనిపై నోటీసులు కూడా ఇవ్వడానికి సిద్ధమైంది పార్టీ. జగ్గారెడ్డి వెనకాల పార్టీ ముఖ్య నాయకుడు ఉన్నారని అనుమానం కూడా ఏఐసీసీ లో ఉంది. ఇదంతా తెలిసినా… జగ్గారెడ్డి మరో లేఖ ను సోనియా.. రాహుల్ కు రాశారు.

ఈ లేఖ లో మరో ట్విస్ట్ ఇచ్చారు జగ్గారెడ్డి. మేం రాస్తున్న లేఖలు మీ దాకా వస్తున్నాయన్న నమ్మకం కూడా మాకు లేదు. అందుకే మీకు రాస్తున్న లేఖను మీడియాకు కూడా విడుదల చేస్తున్నా మని ప్రకటించారాయన. అలాగే పీసీసీ నియామకం పై ఏఐసీసీ ఇంఛార్జి లను నమ్మకండి… మీరు ప్రత్యేక సమాచారాన్ని తెప్పించుకుని విచారించండి అని కూడా ప్రస్తావించారు. ఇవన్నీ చూస్తుంటే జగ్గారెడ్డి ఏదో ఒకటి తేల్చుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

రేవంత్‌కు పీసీసీ ఇవ్వొద్దని మొదటి నుంచి వ్యతిరేకుస్తూ వస్తున్నారు జగ్గారెడ్డి. ఇక హైకమాండ్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన దారి ఆయన చూసుకుంటారన్న టాక్‌ వినిపిస్తోంది. పార్టీ ఓ వైపు కఠిన ఆదేశాలు జారిచేస్తుంటే.. జగ్గారెడ్డి ఏకంగా లేఖ రాయడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news