BREAKING : కాంగ్రెస్‌ కు జగ్గారెడ్డి రాజీనామా !

-

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్నయం తీసుకున్నారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు జగ్గారెడ్డి. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని.. పార్టీ సభ్యత్వం… పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు మాట్లాడలేని సందర్భం లో రాహుల్ గాంధీ సభ పెట్టించానని గుర్తు చేశారు.

నా భార్యను కూడా ఎమ్మెల్సీ బరిలో నిలబెట్టానని.. పార్టీ కోసం పని చేస్తుంటే..సోషల్ మీడియా లో నన్ను కోవర్ట్ గా రాతలు రాయిస్తున్నారని రెచ్చి పోయారు. నా వల్ల పార్టీ ఇబ్బంది పడుతుంది అనే కలర్ ఇస్తున్నారని.. అవమానం భరిస్తు పార్టీలో తాను ఉండలేనని కుండ బద్దలు కొట్టారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామాలు పంపుతానని స్పష్టం చేశారు.

దీనిపై సోనియా గాంధీకి కూడా లేఖ రాస్తానని జగ్గారెడ్డి చెప్పారు.తప్పులు సరిదిద్దుకోండి అంటే… కోవర్ట్ అని నిందలు వేస్తున్నారని ఆగ్రహించారు. కాంగ్రెస్ హేమా హామీలు కూడా mlc ఎన్నికల్లో పోటీ చేయలేదని.. పార్టీ పరువు కోసం.. పోటీ చేయించిన నేను కోవర్ట్ నా..? అని ప్రశ్నించారు. పార్టీ పరువు కాపడినా నేనా కోవర్ట్ ? హుజూరాబాద్ లో పార్టీ పరువు తీసిన వాళ్ళు కోవర్టా..?అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news