దుబాయ్‌లో రూ.30 కోట్లు గెలుచుకున్న జగిత్యాల యువకుడు

-

జగిత్యాల యువ‌కుడికి దుబాయిలో భారీ లాట‌రీ తగిలింది. బ‌తుకుదెరువు కోసం వెళ్లిన ఓ యువ‌కుడికి లక్కు కలిసొచ్చింది. ప్రతి రూపాయి కోసం నిత్యం క‌ష్టప‌డే ఆ యువ‌కుడి జీవితాన్ని ఆ ఒక్క లాట‌రీ మార్చేసింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. లక్ష్మీదేవి కరుణించడంతో తెలంగాణలోని జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఓగుల అజయ్ అనే డ్రైవర్ కోటీశ్వరుడయ్యాడు. దుబాయ్ లో ఉంటున్న అజయ్ కొన్న లాటరీకి ఏకంగా రూ. 30 కోట్ల జాక్ పాట్ తగిలింది. అజయ్ ది నిరుపేద కుటుంబం.

dubai lottery: అదృష్టం వరించడమంటే ఇదే: లాటరీలో తెలంగాణ యువకుడికి రూ. 30  కోట్లు - Telugu Oneindia

ఆయన తండ్రి కూడా మరణించడంతో తల్లే పెంచింది. నాలుగేళ్ల క్రితం ఉపాధికోసం దుబాయ్ కి వెళ్లాడు. అక్కడ ఒక జెవెలరీ షాప్ లో డ్రైవర్ గా పనికి కుదిరాడు. ఈక్రమంలో 30 దిర్హాములతో రెండు ఎమిరేట్స్ లక్కీ లాటరీ టికెట్లు కొనుగోలు చేశారు. ఇందులో ఒక టికెట్ కు రూ. 30 కోట్ల జాక్ పాట్ తగిలింది. తనకు లాటరీ తగలడంతో అజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news