గులాం నబీ ఆజాద్ రాజీనామా పై ఘాటుగా స్పందించిన జైరాం రమేష్

-

కాంగ్రెస్ పార్టీకి..అగ్రనేత గులాంనబీ ఆజాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సోనియాకు లేఖ రాసిన ఆజాద్.. తాను కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అన్ని పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆజాద్ వెల్లడించారు. అయితే రాహుల్ గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిందని గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీలో సంప్రదింపులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీది చిన్నపిల్లల మనస్తత్వం అంటూ చురకలు అంటించారు గులాంనబీ ఆజాద్.రాహుల్‌ గాంధీ సీనియర్ల అందరినీ పక్కన పెట్టేశారని తన రాజీనామా సందర్భంగా గులాం నబీ అజాద్‌ పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీకి రాజకీయ పరి పక్వత లేదని విమర్శలు చేశారు. అయితే ఆయన రాజీనామాపై కాంగ్రెస్ అధిష్టానం ఘాటుగా స్పందించింది.

రాజీనామా చేసేందుకు ఇదా సమయం అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గులాం నబీ ఆజాద్ రాజీనామా చాలా దురదృష్టకరమని అన్నారు. ఓవైపు ధరల పెరుగుదల, నిరుద్యోగం సహా పలు అంశాలపై బీజేపీతో కాంగ్రెస్ పోరాటం సాగిస్తున్న తరుణంలో ఆజాద్ రాజీనామా చేయడం విచారకరమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news