పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…”జల్సా” మరోసారి రిలీజ్ !

-

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న అశేష అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదలయిందంటే చాలు.. ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటారు. మూడేళ్ల సినీ ‘అజ్ఞాతవాసం’ తర్వాత ‘వకీల్ సాబ్’గా సినీ రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ఇటీవల ‘భీమ్లానాయక్’గా ప్రేక్షకులను పలకరించారు.

ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబో లో వచ్చిన సినిమా ‘జల్సా’. ఈ చిత్రం విడుదలై 14 ఏళ్లు పూర్తయింది. అయితే.. ఈ సినిమా ఇప్పుడు ట్రెండింగ్‌ లోకి వచ్చింది. సెప్టెంబర్‌ 2 వ తేదీన ఈ సినిమా మరోసారి థియేటర్లలో రిలీజ్‌ కానుందట. సెప్టెంబర్‌ 2 వ తేదీన పవన కళ్యాణ్‌ పుట్టిన రోజు ఉందని.. ఆ రోజునే జల్సా’ మూవీ రిలీజ్‌ అవుతుందని ట్విట్టర్‌ లో ట్రెండింగ్‌ అవుతోంది. అయితే.. దీనిపై జల్సా చిత్ర బృందం అయిన గీతా ఆర్ట్స్‌ ఇంకా ప్రకటన చేయలేదు. ఇవాళ సాయంత్రం ప్రకటన వచ్చే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news