ఉప ఎన్నిక పై క్లారిటీ ఇచ్చిన జానారెడ్డి..కాంగ్రెస్ నిర్ణయం ఇదేనా

-

ఉప ఎన్నికలపై జానారెడ్డి క్లారిటీ ఇచ్చేశారా..? అధిష్టానానికి ముందే క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారా..? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే… ఎన్నికల బరిలో నిలవను అంటే అది ఎలాంటి సంకేతం పంపుతుందో అనే టెన్షన్ మాత్రం పార్టీ లో ఉంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో జానారెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల మరణంతో అక్కడ ఉపఎన్నిక జరగనుంది. దీంతో అందరి చూపు జానారెడ్డి మీదకు మళ్లింది. ఇదే సమయంలో ఆయన పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. జానారెడ్డి కుమారుడు బీజేపీ నుంచి ఉపఎన్నికల్లో పోటీచేస్తారంటూ పుకార్లు షికారు చేశాయి. అయితే… పార్టీ మారుతారంటూ జరుగుతున్న ప్రచారంపై జానారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయమై ఆరా తీసిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు దీనిపై స్పష్టత ఇచ్చారు. 2023లో పార్టీ అధికారంలోకి వస్తే తానే సీఎం అభ్యర్థినని అలాంటి తాను పార్టీ ఎందుకు మారుతానంటూ రివర్స్‌లో ప్రశ్నించారంటా జానా.

పీసీసీ చీఫ్ ఎవరనే దానిపై అభిప్రాయ సేకరణకు వచ్చిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్‌తో సమావేశమైన జానారెడ్డి.. ఆ తర్వాత ఇతర నేతలతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పేశారు. రెండేళ్ల కోసం జరిగే ఉపఎన్నికల్లో పోటీచేసి ఏం లాభమని జానా అడిగినట్లు తెలుస్తోంది. గతంలోనే ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారంటా. ఈ ఉపఎన్నికల్లో తమ అబ్బాయిని నిలబెడతానని నేతలతో జానారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.

మొత్తనికి జానారెడ్డి తాను పార్టీ మారబోనని… ఎన్నికల్లో పోటీ చేయనని.. రెండు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీ చెప్పినా తన నిర్ణయం మారదని కుండ బద్దలుకొట్టారు. ఇక కాంగ్రెస్ కూడా జానారెడ్డి తనయున్ని అక్కడి నుంచి బరిలో దింపేందుకు ప్రయత్నిస్తుంది. మరో పక్క టీఆర్ఎస,బీజేపీల నుంచి జానా తనయుడు రఘువీర్ రెడ్డికి ఆఫర్లుండటంతో వీరి నిర్ణయం పై ఆసక్తి నెలకొంది. నాగర్జునసాగర్ అంతకుముందు చలకుర్తి నియోజకవర్గం ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండటంతో ఇక్కడ గెలుపుతో టీఆర్ఎస్ కే తామే అసలైన ప్రత్యామ్నయం అని చెప్పేందుకు కృత నిశ్చయంతో ఉంది. బీజేపీ హవాని నిలువరించాలంటే ఈ నియోజకవర్గంలో విజయం కాంగ్రెస్ కి చాలా కీలకం.

Read more RELATED
Recommended to you

Latest news