మళ్ళీ ఏపీలో క్యాబినెట్‌లో మార్పులపై చర్చలు మొదలయ్యాయి…అతి త్వరలోనే జగన్ మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారని కథనాలు వస్తున్నాయి..అయితే అధికారంగా వైసీపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు..ఎప్పుడు మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయి…ఎంతమంది పాతవారిని పక్కన పెట్టి, కొత్తవారికి ఛాన్స్ ఇస్తారనేది క్లారిటీ లేదు. కాకపోతే ఈ బడ్జెట్ సమావేశాల్లోపు క్యాబినెట్‌లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని మాత్రం ప్రచారం నడుస్తోంది.
దీంతో మళ్ళీ ఆశావాహుల ఆశలు చిగురించాయి…మళ్ళీ పదవి దక్కించుకోవడం కోసం లాబీయింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు పశ్చిమలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఆళ్ళ నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజులు జగన్ క్యాబినెట్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరిని తప్పిస్తారు అనేది తెలియడం లేదు. ముగ్గురుని తప్పించే అవకాశాలు కూడా లేకపోలేదని సమాచారం.
ఇదే క్రమంలో మంత్రి పదవి రేసులో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఉన్నారు. అటు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు సైతం కాపు కోటాలో పదవి ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం కాపు కోటాలో ఆళ్ళ నాని మంత్రిగా ఉన్నారు. ఒకవేళ ఆయనని తప్పిస్తే…ఆయన స్థానంలో భీమవరంలో పవన్ కల్యాణ్‌పై గెలిచిన గ్రంథి శ్రీనివాస్‌కే పదవి దక్కే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. గ్రంథి శ్రీనివాస్‌కు పదవి దక్కడం దాదాపు ఖాయమనే ప్రచారం ఉంది.
అటు రంగనాథరాజు ప్లేస్‌లో ప్రసాద్ రాజు వచ్చే అవకాశం ఉంది. రంగనాథ రాజు, ప్రసాద్ రాజులు క్షత్రియ వర్గానికి చెందిన నాయకులు. అలాగే ఎస్టీ కోటాలో పదవి దక్కించుకోవాలని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ట్రై చేస్తున్నారు. చూడాలి మరి పశ్చిమ గోదావరిలో ఈ సారి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో.