ఉక్రెయిన్ నుంచి వెంటనే తిరిగి రండి…. భారత పౌరులకు ప్రభుత్వం సూచన

-

ఉక్రెయిన్ లో ఉంటున్న భారత పౌరులు, ముఖ్యంగా విద్యార్థులు భారత్ కు తిరిగి వచ్చేయాలంటూ.. భారత ప్రభుత్వం సూచన చేసింది. ఉక్రెయిన్, రష్యా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ ఈ సూచన చేసింది. భారత్ నుంచి స్టడీ కోసం వేలాది మంది భారతీయులు ఉక్రెయిన్ వెళ్తుంటారు. ప్రస్తుతం ఈ పరిణామాల మధ్య భారతీయుల్లో గందరగోళం ఏర్పడింది. భారతీయులు ఉక్రెయిన్ లో ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించింది. అలాగే భారత దౌత్యకార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ పై రష్యా ఎప్పుడైనా దాడి చేయెచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్షకు పైగా సైన్యంతో రష్యా యుద్ద సన్నాహాలు చేసింది. మరోవైపు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు యూరోొపియన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫిబ్రవరి 16న రష్యా తమపై దాడి చేయవచ్చంటూ… ఫెస్ బుక్ లో పోస్ట్ చేయడం సంచలన కలిగించింది.

Read more RELATED
Recommended to you

Latest news